టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కేసీఆర్ మంత్రి హరీష్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో హరీష్ ఆ నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో ఓ భారీ సభను ఏర్పాటు చేసిన హరీష్ తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మద్దతుగా భారీ రోడ్ షో నిర్వహించారు. 

కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రోడ్ షో లో హరీష్ రావు పాల్గొన్ని ప్రసంగించారు. కొడంగల్ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాద్యమని హరీష్ స్పస్టం చేశారు.అందువల్ల కొడంగల్ ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి నరేందర్ రెడ్డి గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. కొడంగల్‌లో టీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. తాము గెలిచిన తర్వాత కొడంగల్ ను అభివృద్ధి చేసి చూపిస్తామని హరీష్ హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ రోడ్ షో కి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆటపాటలతో హరీష్ రావుతో పాటు మిగతా మంత్రులు, ఎంపీలకు స్వాగతం పలికారు. 

వీడియో

"