Asianet News TeluguAsianet News Telugu

డబుల్ బెడ్రూం ఇంటిని తిరస్కరించిన మహిళ.. హరీశ్ రావు ప్రశంసలు

మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిశారు.

Minister Harish rao Praises couple Who are not taking double bed room House
Author
Hyderabad, First Published Jan 22, 2021, 11:12 AM IST

రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా తన ఉదార్వాతాన్ని చాటింది. సిద్ధిపేట పట్టణంలోని 11వ వార్డులో నివసిస్తున్న ఫర్వీన్ సుల్తానాకు సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్ లోని బ్లాకు నెంబరు 29 రూమ్ నెంబరు 7లో ప్రభుత్వ రెండు పడకల ఇళ్లు మంజురైంది. మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిశారు.

 ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ను మరొక లబ్దిదారుకు ఇచ్చే ఆలోచనతో  ముందుకొచ్చినట్లు అందుకు సంబంధించిన స్థల పత్రాలను మంత్రి చేతికి రిటర్న్ ఇచ్చింది. ఈ మేరకు ఫర్వీన్ సుల్తానా ఉదారత్వం చూసి మంత్రి హరీశ్ రావు భార్యాభర్తలను అభినందించి వారిద్దరినీ శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios