తెలంగాణలో షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగల కమలాకర్. ఇప్పుడు జగనన్న బాణం వస్తుందని.. తర్వాత జగన్ వస్తాడని, ఆ తర్వాత చంద్రబాబు వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు

తెలంగాణలో షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగల కమలాకర్. ఇప్పుడు జగనన్న బాణం వస్తుందని.. తర్వాత జగన్ వస్తాడని, ఆ తర్వాత చంద్రబాబు వస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని.. కేసీఆరే మనకు రక్షకుడని గంగుల స్పష్టం చేశారు. ఆంధ్రా పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవన్నారు. కేసీఆర్‌ను కాపాడుకోకపోతే మళ్లీ సమైక్య రాష్ట్రం వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

ఆంధ్రా నేతలు కరెంట్, నీళ్లు తీసుకుపోతారని ఆరోపించారు. కొద్దిరోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

షర్మిల పార్టీ ప్రయత్నాలకు మంత్రి చురకలంటించారు. తెలంగాణలో ఫ్యాక్షనిజం అంగీకరించరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్‌లో ఎలాంటి ధిక్కార స్వరాలు లేవని కరీంనగర్​లో గంగుల వివరణ ఇచ్చారు.