అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కోలుకున్నారు. గురువారం రాత్రి ఓ విందుకు హాజరైన అక్బరుద్దీన్‌కు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను కంచన్‌బాగ్‌లోని ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.

ఆయనకు ఆస్పత్రి మొదటి అంతస్తులోని ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త విని ఎంఐఎం నేతలు, కార్యకర్తలు, బంధువులు హుటాహుటిన ఒవైసీ ఆసుపత్రికి చేరుకుని అక్బరుద్దీన్‌ను పరామర్శించి వెళ్లారు. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకోవడంతో.. ఒవైసీని ఆసుపత్రి నుంచి ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2018, 5:31 PM IST