లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో గత ఏడాది చోటు చేసుకున్న ఘటనలే మళ్లీ కనిపిస్తున్నాయి. వలసకూలీలు నడుచుకుంటూ సొంతూళ్లకు వెళ్తున్నారు. కాంట్రాక్టర్లు పనులు లేవని చెప్పడంతో ఏం చేయాలో తెలియక సొంతింటి బాట పడ్డారు. బస్సులు, రైళ్లు , ఇతర ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో ఖాళీ నడకనే ప్రయాణం మొదలుపెట్టారు.

దేశంలోని చాలా చోట్ల ఇదే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి తెలంగాణ సర్కార్ లాక్‌డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు ఆందోళన చెందారు. తమ సొంత రాష్ర్టాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలు కిటకిట లాడాయి.
Also Read:తెలంగాణలో లాక్‌డౌన్: ఏపీ వాహనాలకు నో ఎంట్రీ, అత్యవసర వాహానాలకు పర్మిషన్
కాగా, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మే 12 నుంచి ఉదయం 10 గంటల నుంచి పదిరోజు పాటు (ఈనెల 22వ తేదీ వరకు) రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది.
కేబినెట్ భేటిలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలకు మాత్రమే అనుమతినిచ్చారు. మిగతా 20 గంటల పాటు లాక్‌డౌన్ కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు