నేడు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవమన్న సంగతి తెలిసిందే. కాగా  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఎందరో అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా, దశాబ్దాల కల సాకారం చేసి జన హృదయ నేత సీఎం కేసీఆర్ గారికి, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

అదేవిధంగా..ఈ రోజు (మంగళవారం) తమిళ సై జన్మదినోత్సవం. ఈ సందర్భంగా చిరంజీవి.. `గౌరవనీయులైన డా.తమిళ సై సౌందరరాజన్‌గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలా దేశ సేవలో మీరు మరెన్నో పుట్టినరోజులను జరుపుకోవాలని కోరుకుంటున్నా` అని ట్వీట్ చేశారు. చిరు ట్వీట్‌కు తమిళసై ధన్యవాదాలు తెలియజేశారు.
 

కాగా... తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి  ప్రగతి భవన్‌లో‌ కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అలాగే కరోనా వ్యాప్తిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అందరూ మాస్కులు, శానిటైజర్లు విధిగా ఉపయోగించడం, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా సూచించింది.