హైదరాబాద్: రాజస్థాన్ నుండి హైద్రాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చిన వివాహిత భర్తకు చెప్పకుండానే మరో వ్యక్తి బైక్ పై కొడుకుతో కలిసి వెళ్లిపోయింది.సీసీటీవీ పుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన భర్త షాకయ్యాడు.

రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ నుండి  దంపతులు కొడుకుతో కలిసి హైద్రాబాద్ లోని బంధువుల ఇంటికి చేరుకొన్నారు. బంధువుల ఇంట్లో సరదాగా గడిపిన తర్వాత  దంపతులు తిరిగి  జోథ్‌పూర్ వెళ్లేందుకు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొన్నారు.రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసేందుకు వస్తానని చెప్పి కొడుకుతో కలిసి ఆమె వెళ్లిపోయింది. వాటర్ బాటిల్ కోసం వెళ్లిన ఆమె ఎంతకు తిరిగి రాలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీటీవీ పుటేజీని  పోలీసులు చూశారు. అయితే వాటర్ బాటిల్ కోసం వెళ్లిన వివాహిత మరో వ్యక్తి బైక్ పై  కొడుకుతో కలిసి వెళ్లిపోయింది. అయితే  వివాహిత భర్తకు చెప్పకుండా మరో వ్యక్తి బైక్ పై ఎందుకు వెళ్లిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.