ఓ మహిళ మామతో వివాహేతర సంబంధం నిర్వహిస్తున్న సమయంలో కూతురు చూసింది. తమ విషయం బయటకు పొక్కుతుందనే ఉద్దేశంతో మామ, కోడలు కలిసి చిన్నారిని చంపేశారు. ఈ ఘటన ఖమ్మంలో జరిగింది. 

వివాహేత సంబంధాలు ఎంత‌దూర‌మైన తీసుకెళ్తాయి. ఎంత దారుణానికి అయినా ఒడిగ‌ట్టేలా ప్రేరిపిస్తాయి. క్ష‌ణికావేశం కోసం ప్రాణాలు తీసుకున్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. 

ఆ మ‌హిళ‌ల‌కు పెళ్లి అయ్యింది. భ‌ర్త డ్రైవ‌ర్ (driver). త‌ర‌చుగా జీవ‌నోపాధి కోసం ఇంట్లో ఉండ‌కుండా వివిధ ప్రాంతాలు తిరుగుతుంటాడు. అయితే ఈ స‌మ‌యంలో భ‌ర్త తండ్రితో ఆమెకు అక్ర‌మ సంబంధం ఏర్పడింది. ఇది దాదాపుగా కొన్ని సంవ‌త్స‌రాల పాటు కొన‌సాగింగింది. అయితే ఇలా వీర‌ద్ద‌రూ ఏకాంతంగా ఉన్న స‌మ‌యంలో కూతురు గ‌మ‌నించింది. ఒక్క సారిగా షాక్ కు గుర‌య్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రికి చెప్పేస్తాన‌ని వారితో తెలిపింది. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డితే త‌మ‌కు ఇబ్బంది వ‌స్తుందో అని ఆ కోడలు, మామ పాప‌ను చంపేశారు. అనారోగ్యం వ‌ల్ల చ‌నిపోయింద‌ని అంద‌రినీ న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ పోలీసుల ద‌ర్యాప్తులో అది సాధార‌ణ మ‌ర‌ణం కాదు హ‌త్య అని తేలింది. 

పోలీసులు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఖ‌మ్మం (khammam) జిల్లా బోనకల్ (bonakal) ప్రాంతానికి చెందిన సునీత‌- హరికృష్ణ‌ల‌కు కొనేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ చ‌దువుకుంటున్నారు. భ‌ర్త లారీ, ఆటో డ్రైవ‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. జీవనోపాధిలో భాగంగా వివిధ ప్రాంతాల‌కు డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు. ఇలా త‌ర‌చూ భ‌ర్త బ‌య‌టకు వెళ్తుండ‌టంతో మామ నర్సింహారావుతో సునీత‌కు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఇది దాదాపుగా 5-6 సంవ‌త్స‌రాలుగా కొన‌సాగుతోంది. 

ఇలా వివాహేత సంబంధం సాగుతున్న క్ర‌మంలో వీరిద్ద‌రూ ఒకే రూమ్ లో ఉండ‌టం పెద్ద కుమార్తె 
మహాదేవి (11) చూసింది. అనుకోకుండా చూసిన ఈ దృష్యాల‌ను జీర్ణించుకోలేక‌పోయిన చిన్నారి.. ఈ విష‌యాన్ని తండ్రి కి చెప్పేస్తాన‌ని అంది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన మామ, కోడ‌ళ్లు చిన్నారిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 8వ తేదీన ఆ చిన్నారిని నోట్లో బ‌ట్ట‌లు పెట్టి, మెడ‌పై తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అయితే దీనిని హ‌త్య‌గా కాకుండా సాధార‌ణ మృతిగా చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. అందులో భాగంగానే త‌న కూతురుకు స్కూళ్లో ఫిట్స్ వ‌చ్చాయ‌ని, ఆ స‌మ‌యంలో మృతి చెందింద‌ని అంద‌రికీ చెప్పింది. అయితే చిన్నారి మెడ‌పై గాయాలు ఉండ‌టాన్ని బంధువులు చూశారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలియ‌జేశారు. దీంతో పోలీసులు మృత‌దేహాన్ని పోస్టు మార్టంకు పంపించారు. రిపోర్టులో హ‌త్య అని తేల‌డంతో మృతురాలి త‌ల్లిని, తాత‌ను విచారించారు. దీంతో తామే ఈ దారుణానికి ఒడిగ‌ట్టామ‌ని వారు ఒప్పుకున్నారు. అనంత‌రం వారిని అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసుల‌ను వైరా ఏసీపీ స్నేహమెహ్రా అభినందించారు.