లాక్‌డౌన్ పాసుల జారీలో రూల్స్ బ్రేక్: మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణపై వేటు
లాక్‌డౌన్ సమయంలో వాహనాల పాసుల జారీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణపై డీజీపీ మహేందర్ రెడ్డి వేటేశారు. లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మంచిర్యాల: లాక్‌డౌన్ సమయంలో వాహనాల పాసుల జారీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మంచిర్యాల ఏసీపీ లక్ష్మీనారాయణపై డీజీపీ మహేందర్ రెడ్డి వేటేశారు. లక్ష్మీనారాయణను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర విధులు నిర్వహిస్తున్నవారికి పోలీసులు పాస్ లు జారీ చేశారు.
also read:లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు: తెలంగాణ ఉన్నత విద్యామండలి
జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఈ పాసులు దుర్వినియోగం అవుతున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాసుల దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పాసులను రద్దు చేస్తామని డీజీపీ నాలుగు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పాసుల జారీలోనే ఏసీపీ లక్ష్మీనారాయణ నిబంధనలను పాటించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఆయనపై వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ గురువారం నాడు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన: ఒక్కరోజులోనే 1.25 లక్షల వాహనాలు సీజ్
లాక్ డౌన్ ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలను చూపుతూ వందలాది మంది రోడ్లపైకి వస్తున్నారు. దీని కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. దీంతో మూడు రోజుల నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు.