చేవెళ్ల: తన భార్య మరో వ్యక్తితో కలిసి ఉండగా చూసిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య ప్రియుడితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా భర్త పట్టుకున్నాడు. ఇద్దరిపైనా పెట్రోలు పోసి, నిప్పంటించాడు. 

మంటలు అంటుకుని అతని భార్య మరణించింది. ఆమె ప్రియుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. 

అంబేడ్కర్‌ కాలనీలోని భాగ్యలక్షి(25)కి పదేళ్ల క్రితం మండల పరిధిలోని దామరిగిద్ద గ్రామానికి చెందిన రవితో పెళ్లయింది. భార్యభర్తలు అంబేడ్కర్ కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 

భాగ్యలక్ష్మి కొన్నాళ్లుగా ఉమర్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో భర్త రవి వారిపై కక్ష కట్టాడు. శనివారం రాత్రి భాగ్యలక్ష్మి తన ఇంట్లోనే ఉమర్‌తో కలిసి ఉండడాన్ని రవి కనిపెట్టాడు. బైక్‌లోంచి పెట్రోల్‌ను డబ్బాలో నింపుకొని బెడ్‌పై పడుకున్న భార్య, ప్రియుడిపై పోసి నిప్పంటించి పారిపోయాడు.