సంగారెడ్డి జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 


సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లాలోని మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన శేఖర్ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన పోలీసులు కోర్టులో నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు.ఈ కేసును విచారించిన పోక్సో కోర్టు నిందితుడు శేఖర్ ను దోషిగా నిర్ధారించింది. అంతేకాదు నిందితుడికి శేఖర్ కు పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు సోమవారం నాడు తీర్పు చెప్పింది.

2019లో చిన్నారిపై శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని టెక్నాలజీ ఆధారంగా సాక్ష్యాలను సేకరించారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ తరహా కేసుల్లో దోషులకు త్వరగా శిక్షలు పడేలా చేయాలనే డిమాండ్ కూడ ఉంది. అయితే ఇటీవల కాలంలో పాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఈ తరహా కేసులను విచారించి దోషులకు శిక్ష పడేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలుగుతుంది.