చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి బాలుడిపై అత్యాచారం చేశాడో కామాంధుడు. వివరాల్లోకి వెళితే.. గోల్కొండ జిన్సీ బజార్‌కు చెందిన హర్షద్ నదీమ్ ప్రైవేట్ ఉద్యోగి.. స్థానికంగా ఉంటున్న ఓ బాలుడిని సిలిండర్ తీసుకురావాలి, చాక్లెట్ ఇప్పిస్తానంటూ అతనిని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని డబ్బులు ఇచ్చి ఇంటి వద్ద వదిలేశాడు. అయితే బాలుడు మూడు గంటల పాటు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.

ఈ క్రమంలో బాలుడు సాయంత్రం ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు బాగా భయపడుతూ ఉండటంతో.. ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.