జగిత్యాలలో దారుణం జరిగింది. మండలంలోని  ఓ గ్రామంలో ఈనెల 20న సాయంత్రం నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనిపై బాలిక తల్లి పిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మరోవైపు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిన తర్వాత ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. తన బండారం బయటపడటంతో ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. పరారీలో ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.