తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ మూర్ఖుడు నవమాసాలు మోసి, కని, పెంచిన కన్న తల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం దుద్యాలలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... దుద్యాలకు చెందిన అశోక్ మేస్త్రీ పని చేసుకుంటూ భార్య పిల్లలు, తల్లిని పోషించేవాడు. ఈ మధ్య తాగుడికి బానిసయ్యాడు. సంపాదించినదంతా మద్యానికే ఖర్చుపెట్టేవాడు. గురువారం మద్యం కోనుగోలు చేసుకోవడానికి డబ్బులు కావాలంటూ తల్లి అంజిలమ్మను కోరాడు.

సంపాదించిన సొమ్మంతా తాగుడుకు పెడుతున్నాడని ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అశోక్ కన్న తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. కాగా... ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.