వివాహేతర సంబంధం: సంగారెడ్డిలో ప్రియురాలి భర్తను చంపిన ప్రియుడు

వివాహేతర సంబంధం కారణంగా  సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య చోటు చేసుకుంది.  ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man kills For Extra marital affair in Sangareddy District  lns

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో  వివాహేతర సంబంధంతో  కృష్ణ అనే వ్యక్తిని ప్రశాంత్  దారుణంగా హత్య చేశారు.  వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

కృష్ణ భార్యతో  ప్రశాంత్ కు  కొంతకాలంగా  వివాహేతర సంబంధం ఉందనే  ఆరోపణలున్నాయి.ఈ విషయమై  గ్రామంలో  పెద్ద మనుషుల మధ్య  పంచాయితీ కూడ  జరిగింది.  దీంతో  కృష్ణ భార్య  పుట్టింటికి వెళ్లింది.  ఈ విషయాలను దృష్టిలో  పెట్టుకుని కృష్ణను ప్రశాంత్  తన స్నేహితులతో కలిసి  హత్య చేశారు. ఈ హత్య చేసిన తర్వాత  నిందితులు పోలీసులకు లొంగిపోయారు.  ఈ హత్య విషయం తెలిసిన వెంటనే  కృష్ణ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios