ప్రేమించి, గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకోమంటే.. అడవిలోకి తీసుకెళ్లి అతడు చేసిన పని..

ప్రేమించి, గర్బవతిని చేసిన ప్రియరాలు పెళ్లి చేసుకోమని ఒత్తడి తేవడంతో దారుణానికి ఒడిగట్టాడు. నల్లమల అడవిలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. 

man killed pregnant lover and burnt in forest in nagarkurnool - bsb

నాగర్ కర్నూల్ : ప్రేమించిన మహిళ  పెళ్లి చేసుకోమని గట్టిగా అడగడంతో దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రియుడు. గర్భవతి అని కూడా చూడకుండా ఆమె మీద పెట్రోల్ పోసి దహనం చేశాడు.  ఈ ఘటన నాగర్ కర్నూల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండడంతో శ్రీశైలంలో చేసుకుందామని తీసుకువెళ్లి.. నల్లమల అడవుల్లో దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశాడు. దీనికి సంబంధించి జడ్చర్ల సిఐ రమేష్ బాబు వివరాలను తెలిపారు..

ఈ ఘటనలో బాధితురాలు లక్ష్మీ అలియాస్ రత్నమ్మ (34)  నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం గొరిట నివాసి. ఆమెకు అంతకుముందే వివాహమయ్యింది. గొడవల కారణంగా  మూడేళ్ల క్రితం భర్తతో విడిపోయి దూరంగా ఉంటుంది. జీవనం గడవడం కోసం కూలీ పనులకు వెళుతుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్  చెన్నయ్యతో పరిచయం ఏర్పడింది.  అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 

భార్య మీద కోపం.. కూతుళ్లకు కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చిన తండ్రి.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

ఈ క్రమంలోనే చెన్నయ్య మరో యువతిని వివాహం చేసుకున్నాడు.  తనతో సంబంధం పెట్టుకుని మరో యువతిని ఎలా వివాహం చేసుకుంటావ్ అంటూ లక్ష్మి గొడవ పడింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో ఆ సమయంలో అతను లక్ష రూపాయల జరిమానా చెల్లించాడు. నిరుడు చెన్నయ్య భార్య గర్భిణి అయ్యింది.  ఆ సమయంలో మళ్ళీ లక్ష్మీ దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం లక్ష్మి కూడా గర్భం దాల్చింది. 

ఏడు నెలల గర్భంతో ఉండడంతో తనను పెళ్లి చేసుకోవాలని  లక్ష్మీ పట్టు పట్టింది. తన పేరిట రెండు ఎకరాల భూమి రాసి ఇవ్వాలని కోరింది. లేకపోతే, గ్రామంలోకి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్య మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో విసిగిపోయిన చెన్నయ్య ఎలాగైనా ఆమెని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.నువ్వు అడిగినట్టే పెళ్లి చేసుకుందామని శ్రీశైలానికి తీసుకువెళ్లాడు. ఈ ప్రకారం ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి  బైక్ మీద  ఇద్దరు వెళ్లారు. దారిలో  ఫరహాబాద్ - మన్ననూర్ మధ్యలో ఉన్న తాళ్లచెరువు దగ్గర నుంచి నల్లమల అడవిలోకి తీసుకువెళ్లాడు. 

ఆమె ఏదో అడిగేలోపే కర్రతో తల మీద భారీ గొంతు నులిమి చంపేశాడు. ముందే  వేసుకున్న పథకం ప్రకారం బైక్ లో ఉన్న పెట్రోల్ తీసి ఆమె  మృతదేహంపై పోసాడు. ఆ తర్వాత నిప్పంటించి కాల్చేశాడు. ఇది జరిగిన 20 రోజులకు కూతురు కనిపించకపోవడంతో లక్ష్మి తల్లిదండ్రులు కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మార్చి 25న  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చెన్నయ్య మీద అనుమానం ఉన్నట్లుగా పోలీసులకు వారు తెలిపారు. 

అప్పటికే చిన్నయ్య పరారీలో ఉన్నాడు. వారి ఫిర్యాదు మేరకు గాలింపు మొదలుపెట్టిన పోలీసులు సోమవారం నాడు స్థానిక నిమబాయి గడ్డ వద్ద చెన్నయ్యను పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో వెంటనే అతని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే చెన్నై మీద గతంలో కూడా నేరాలు చేసిన చరిత్ర ఉంది. అత్యాచారం చేసి.. దీనికిగాను మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios