వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మౌంటిన్ బైక్ నుంచి పడి అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ దుర్మరణం పాలయ్యాడు. అరవింద్ పిచాయ్ అనే వ్యక్తి వికారాబాద్ జిల్లా ధారూర్ హిల్స్ అండ్ వాలి అడ్వెంచర్ రిసార్ట్‌లో‌ బస చేశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం గైడ్ లేకుండానే మౌంటిన్ బైక్ రైడింగ్ చేశాడు. ఈ సమయంలో బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.