Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాలలో విషాదం: గొంతుకు మాంజా బిగుసుకొని వ్యక్తి మృతి

గాలిపటం ఎగురవేసే మాంజా గొంతుకు బిగుసుకొని భీమయ్య అనే వ్యక్తి మరణించాడు.ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకొంది. కళ్లముందే భర్త మరణించడంతో భీమయ్య భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. 

Man killed after getting entangled with kite string in Telangana Mancherial district
Author
Hyderabad, First Published Jan 15, 2022, 7:47 PM IST

మంచిర్యాల: గాలి పటం ఎగురవేసేందుకు ఉపయోగించే మాంజా గొంతుకు చుట్టుకుని Bheemaiah అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. Sankranti రోజునే ఈ  ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Mancherialలో బైక్ పై దంపతులు వెళ్తున్నారు.ఈ సమయంలో kite  ఎగురవేసేందుకు ఉపయోగించిన Maanjha బైక్ నడుపుతున్న భీమయ్య అనే వ్యక్తి గొంతుకు చుట్టుకుపోయింది. బైక్ వేగంగా ఉన్నందున మాంజా ఆ వ్యక్తికి గొంతుకు బిగుసుకుపోయి రక్తం కారింది.  వెంటనే బైక్ పై నుండి కిందపడిన భీమయ్య అక్కడికక్కడే మరణించాడు.  పండుగ రోజునే తన కళ్ల ముందే భర్త చనిపోవడంతో  భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.

గతంలో కూడా దేశంలో మాంజా గొంతుకు చుట్టుకుని పలువురు మరణించిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. గత ఏడాది ఆగష్టు మాసంలో ఢిల్లీలో మాంజా గొంతుకు బిగుసుకుపోయి 23 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వాయువ్య ఢిల్లీలోని కన్హయ్యనగర్ లో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో వ్యక్తి గొంతుకు బిగుసుకుపోయింది.

ఒడిశా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన వరుడు మాంజా గొంతుకు చుట్టుకుని మరణించిన ఘటన జరిగింది. గత ఏడాది డిసెంబర్ 27న కటక్ జిల్లా భైర్‌పూర్ ప్రాంతానికి చెందిన జయంత్ సమల్  మరణించాడు.తన భార్యతో కలిసి  జయంత్ బైక్ పై వెళ్తున్న సమయంలో మాంజా ఆయన గొంతుకు చిక్కుకొని గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపుగా ఆయన మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

2016లో  ఒడిశా హైకోర్టు మాంజాను నిషేధించింది.  అయినా కూడా ఈ తరహ మాంజాను ఉపయోగించడం వల్లే జయంత్ మరణించాడని మృతుడి బంధువులు చెబుతున్నారు.ఢిల్లీలోని పశ్చిమ విహార్లో  మాంజా గొంతుకు చుట్టుకుని మానవ్ అనే సివిల్ ఇంజనీర్ 2019 ఆగష్టు 19న చనిపోయాడు. సోదరితో కలిసి బైక్ పై వెళ్తున్న సమయంలో మాంజా గొంతుకు బిగుసుకొందని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios