కోరిక తీర్చాలంటూ.. వాట్సాప్ లో ఓ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు చేసి ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు


కోరిక తీర్చాలంటూ.. వాట్సాప్ లో ఓ యువతికి అసభ్యకరమైన మెసేజ్ లు చేసి ఓ యువకుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...విజయనగరం బొబ్బపేట ఫేజ్‌-3కి చెందిన లగడపాటి దుర్గాసుధేష్‌బాబు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. గత కొంత కాలంగా ఓ యువతిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

ఆమె వాట్సాప్‌ నంబర్‌కు తరచూ అసభ్య సందేశాలు పంపించడంతో పాటు శారీరక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. వాటిని భరించలేక బాధితురాలు షీ బృందాన్ని ఆశ్రయించింది. దీంతో నిందితుడిని గుర్తించిన షీ బృందాలు అతడిని అరెస్టు చేసి సోమవారం నగర 14వ స్పెషల్‌ ఎంఎం కోర్టులో హాజరుపరిచడంతో కోర్టు అతడికి ఏడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.250 జరిమానా విధించారు.