Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ కవిత టీవీ చానల్ లో.. చైర్మన్ పదవి పేరుతో మోసం..

ప్రముఖుల పేర్లు చెప్పి ఘరానా మోసాలు చేసే వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతుంది. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పేరుతో ఓ ఘరానా మోసం కామారెడ్డిలో బయపటింది. 

man frauding under the name of nizamabad mlc kavitha tv channel - bsb
Author
Hyderabad, First Published Apr 7, 2021, 9:18 AM IST

ప్రముఖుల పేర్లు చెప్పి ఘరానా మోసాలు చేసే వారి సంఖ్య ఇటీవల పెరిగిపోతుంది. తాజాగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పేరుతో ఓ ఘరానా మోసం కామారెడ్డిలో బయపటింది. 

ఎమ్మెల్సీ కవిత టీవీ చానల్ పేరుతో నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ. 6.50 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఉదంతం కామారెడ్డిలో మంగళవారం వెలుగుచూసింది. పట్టణంలోని విద్యా నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చాడు. అతనికి పరిచయం అయిన మహేష్ గౌడ్, వినోద్ ఎమ్మెల్సీ కవిత కు చెందిన టీవీ ఛానల్ ఒకటి ఉందని, అందులో చైర్మన్ పదవి వేములవాడ, కామారెడ్డి లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించారు,

చైర్మన్ హోదాతో తయారు చేసిన ఐడీ కార్డు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు సైతం చేతికి అందించారు. దీంతో వారు చెప్పింది నమ్మిన మహమ్మద్ రూ. 6.50  ముట్టచెప్పాడు. అంతేగాక ఎమ్మెల్సీ కవిత తో రహస్యంగా మాట్లాడవచ్చని ఓ వాకీటాకీ ని కూడా ఇచ్చారు. అయితే ఇదంతా మోసమని తర్వాత గుర్తించిన మొహమ్మద్ పోలీసులను ఆశ్రయించాడు. మహేష్, వినోద్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios