మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ బిడ్డలతో సహా ఒంటరిగా నివసిస్తోంది.  ఆపదలో అండగా ఉంటారనే భరోసాతో అయినవారి పంచన చేరింది. అయితే.. బాధలో ఉన్న ఆమెను ఓదార్చాల్సిందిపోయి.. ఆమెపై కన్నేశాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం, అద్నూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లింగంపల్లిలోని తారానగర్‌లో భార్యాపిల్లలతో ఉంటున్నాడు. సంగారెడ్డికి చెందిన ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆమె అతడికి వరుసకు మేనకోడలు అవుతుంది.  ఒంటరిగా ఉన్న మేనకోడలిపై కన్నేశాడు. తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. అవసరం లేకుండానే అన్ని పనులు చేసిపెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆమెను లొంగదీసుకొని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం అతనికి భార్యకు తెలియడంతో.. గొడవలు జరిగాయి. దీంతో.. ఆమె అతనికి దూరంగా వెళ్లి పోయి తన జీవితం తాను గడుపుతోంది. అయితే.. మేనకోడలితో ఇంకా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య గొడవచేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అతను.. మేనకోడలు ఎక్కడ ఉంటుందో కనుక్కొని చంపేందుకు ప్రయత్నించాడు. స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.