ఇండోర్ కు వెళ్లి స్నేహితుడైన అంకిత్ భార్యను హైదరాబాద్ తీసుకువచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. ఆమెను కుందన్ భాగ్ లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరీ అక్కడ ఉంచాడు.

స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చాడు. కాగా.. ఇలా చేస్తున్నావేంటని సదరు మహిళ భర్త తరపు బంధువులు వచ్చి ప్నశ్నించగా.. ఈ వ్యక్తి వాళ్లపై దాడి చేయడం గమనార్హం. ఈ దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన పంజాగుట్ట సమీపంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇ ండోర్ ప్రాంతానికి చెందిన అంకిత్ శుక్లా, యోగేష్ అట్లా స్నేహితులు. యోగేష్ బేగం బజార్ లో వ్యాపారం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఇండోర్ కు వెళ్లి స్నేహితుడైన అంకిత్ భార్యను హైదరాబాద్ తీసుకువచ్చాడు. ఆమెకు మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. ఆమెను కుందన్ భాగ్ లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని మరీ అక్కడ ఉంచాడు.

కాగా... అంకిత్.. తన భార్య కనపడటం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కుందన్ బాగ్ లో ఉన్నట్లు గుర్తించారు. జనవరి 29న అంకిత్ తన మామ విశ్వసుందర్ శుక్లా(65) హైదరాబాద్ వచ్చి.. యోగేష్ ని నిలదీశారు. ఈ క్రమంలో.. వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో విశ్వసుందర్ తలకి గాయం కాగా.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో.. యోగేష్ పై హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడు పరారీలో ఉండగా.. అతని కోసం గాలిస్తున్నారు.