హైదరాబాద్: మద్యం అనుకొని యాసిడ్ తాగిన ఓ ప్రభుత్వ ఉద్యోగి  మృతి చెందాడు. ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది

సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని చిన్నతోకట్ట ప్రాంతానికి చెందిన గణేష్ మింట్ కాంపౌండ్‌లో నాలుగో తరగతి ఉద్యోగిగా విదులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో మద్యం సేవించాడు.

మద్యం మత్తులోనే ఇంటికి చేరుకొన్నాడు. అయితే ఇంటికి వచ్చిన గణేష్ యాసిడ్‌ బాటిల్‌ను మద్యం బాటిల్‌గా భ్రమపడి యాసిడ్‌ను తాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ శనివారం సాయంత్రం మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంసభ్యులకు అప్పగించారు పోలీసులు.