హైదరాబాద్:  అవుటర్ రింగ్ రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో అతడికి చికిత్స నిర్వహిస్తున్నారు.

బీఎండబ్ల్యూ కారులో ఓ వ్యక్తి అవుటర్ రింగ్ రోడ్డులో కారులో ప్రయాణం చేశాడు. అయితే ఏమైందో  తెలియదు కానీ ఆ వ్యక్తి  తన వద్ద ఉన్న గన్‌తో కాల్చుకొన్నాడు. కారులో నుండి పెద్దగా శబ్దం రావడంతో రోడ్డుపైనే కొద్దిసేపు వాహనాలను నిలిపివేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కారులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఫైజాన్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించారు. ఫైజాన్ అహ్మద్  యూఎస్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

అతడిని కేర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్స్ ఏజెన్సీ నుండి ఫైజాన్ అహ్మద్  బెంజ్ కారును అద్దెకు తీసుకొన్నాడని పోలీసులు గుర్తించాడు. కారులో ఒక్కడే ఉన్నట్టుగా గుర్తించినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. పైజాన్ అహ్మద్  ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన  వ్యక్తి ఉపయోగించిన గన్ ఎవరిదనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.