తన చెల్లెలికి ఓ యువకుడు బంగారం అంటూ మెసేజ్ చేశాడని వార్నింగ్ ఇచ్చాడు. తన ప్రియురాలి అన్న బెదిరింపులతో భయపడిపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన వంశీ(20) ఈ ఏడాది జనవరి 15వ తేదీన గ్రామ శివారులోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద మృతిగా  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మెసేజ్‌లను పరిశీలించారు.

నా చెల్లికి ‘గుడ్‌ నైట్‌ బంగారం’ అని మెసేజ్‌ పంపు తావా?  ఎన్ని రోజులకైనా నిన్ను చంపేస్తా.. అని అదే గ్రామానికి చెందిన యువ కుడు గాదె బుచ్చయ్య  నుంచి వంశీకి మెసేజ్‌ వచ్చినట్లు ఉంది.  ఈ క్రమంలో వంశీ ఆత్మహత్యచేసుకున్నాడు. వంశీ  ఫోన్‌ మెసేజ్‌లు, కాల్‌డేటా, వాయిస్‌ రికార్డింగ్‌  ఆధారంగా నిందితుడు బుచ్చయ్యను పోలీసులు సోమవారం అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.  వంశీని ఆత్మహత్యకు ప్రేరేపించిన బుచ్చయ్యను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.