దారుణం : తీసుకున్న డబ్బు అడిగిందని... చంపి సెప్టిక్ ట్యాంక్ లో పడేసి...
తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమన్నందుకు ఓ మహిళ మీద అత్యాచారయత్నం చేసి, తిరస్కరించిందని ప్రాణాలు తీశారు కిరాతకులు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమన్నందుకు ఓ మహిళ మీద అత్యాచారయత్నం చేసి, తిరస్కరించిందని ప్రాణాలు తీశారు కిరాతకులు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో పడేసిన నిందితులను పర్వతగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు.
హన్మకొండలోని కమిషనరేట్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలు వెల్లడించారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ కు చెందిన ఒగ్గు కొంరయ్య తన భార్య కొంరమ్మ(50) ఈ నెల 4 సాయంత్రం నుంచి కనిపించడం లేదని పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇంతలోనే ఈ నెల 8న పోడేటి కృష్ణ పర్వతగిరి పోలీసుల ఎదుట లొంగిపోయి కొంరమ్మను తన స్నేహితుడు మేకల రాజుతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈ సందర్భంగా విచారణ చేపట్టగా వివరాలు వెల్లడించారు. ఇద్దరు నిందితులు మంచి స్నేహితులని, నిందితుడు కృష్ణ ఇంటి వద్ద తరచూ దావత్ చేసుకుంటారని డీసీపీ తెలిపారు. ఈ నెల 4న వీరితో పాటు పంథినికి చెందిన మణి, కుమార్.. కృష్ణ ఇంటి దగ్గర దావత్ చేసుకున్నారు.
ఎస్సైతో అక్రమ సంబంధం: లేడీ కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య...
మృతురాలు ఒగ్గు కొంరమ్మ సాయంత్రం 4 గంటల సమయంలో కృష్ణ ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వాలని అడిగింది. ఆమెకు ఏదో చెప్పి పంపించారు. మృతురాలు మరోసారి డబ్బుకోసం ఇంటికి రాగా నిందితులు కృష్ణ, రాజు ఆమెను బలవంతం చేయబోగా తిరస్కరించి, ఈ విషయాన్ని పెద్దలకు చెబుతానని బెదిరించింది.
దీంతో కృష్ణ ఇటుకతో, రాజు కర్రతో కొట్టి ఆమెను హత్య చేశారు. ఆతర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేసి మూసివేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. అయితే కొమురమ్మ ఆచూకీ కోసం ఆరా తీసే క్రమంలో కృష్ణ మీద అనుమానం రాగా, ఎలాగైనా దొరికపోతాననే భయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు.
కాగా, నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన మామూనూర్ ఏసీపీ నరేష్ కుమార్, పర్వతగిరి ఇన్ స్పెక్టర్ కిషన్, ఎస్సైలు నరేష్, మహేందర్ డీసీపీ అభినందించారు.