హైదరాబాద్‌ : వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ జెప్పాడానికే తాము సచివాలయ సందర్శన చేశామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. సచివాలయం భవనాల పరిశీలన తర్వాత సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయ భవనాలను కూలుస్తా అంటున్నారని ఆయన గుర్తు చేశారు. 

అనేక అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగం, వ్యవసాయం ఇలా అనేక అవసరాలు తీరాక కొత్త సచివాలయం కడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

ఈ అసెంబ్లీకి, సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సరిపోయే అన్ని సదుపాయాలు,హంగులు ఉన్నాయని, వసతులు లేవని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. సచివాలయంలో అన్ని బ్లాకులు 10 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల క్రితం కట్టినవేనని అన్నారు. అందరి అవసరాలు తీర్చే అతిపెద్ద భవనం ఈ సచివాలయమని ఆయన అన్నారు. 

సచివాలయంలో ఉన్న అన్ని బ్లాక్‌లు చాలా బాగున్నాయని, సీఎం కేసీఆర్ మనసులో ఇక దుర్మార్గ ఆలోచన తట్టిందని, అన్ని భవనాలపైన తన పేరు ఉండేలా కేసీఆర్ ఇలాంటి తప్పుడు నిధుల దుర్వినియగా నిర్ణయాల తీసుకుంటున్నారని ఆయన అన్నారు. 

"