తాను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు.

తాను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన కేసీఆర్ కి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల కోసం కష్టపడి పనిచేసినట్టు వెల్లడించారు. తనకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువని, ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.