కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గోనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మేడిగడ్డకు చేరుకున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఫడ్నవీస్‌కు తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఘనస్వాగతం పలికారు.

అనంతరం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌‌, ఇతర తెలంగాణ మంత్రులతో కలిసి ఫడ్నవీస్ హెలికాఫ్టర్‌లో మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్, ఫడ్నవీస్‌లకు స్వాగతం పలికి యాగశాల వద్దకు తీసుకువచ్చారు.