కరీంనగర్‌: కాళేశ్వరం ప్రాజెక్టుతో  తమ రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత ఆయన మీడియాతో  మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రమే మారిపోనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్ర ప్రజలు కానుకగా ఇచ్చారని  ఆయన అభిప్రాయపడ్డారు. 

ఈ ప్రాజెక్టుతోతమ రాష్ట్రంలోని భూములకు కూడ సాగునీరు అందుతోందన్నారు. అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలంగాణ సర్కార్ పై ఫడ్నవీస్ ప్రశంసించారు. 

ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర సర్కార్ ఒప్పుకోలేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కాళేశ్వరానికి మార్చారు.