తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి పక్షాన నిలుస్తున్న ఎమ్మార్పిఎస్ కు అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్ లో ఎమ్మార్పిఎస్ నాయకులు మందకృష్న మాదిగతో ఉత్తమ్, కుంతియా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానకర రీతిలో అరెస్ట్ చేసి, జైలుకు పంపించి నానా ఇబ్బందులకు గురి చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. అంతేకాకుండా తెలంగాణ  ఏర్పడిన తర్వాత దళితున్ని సీఎం చేస్తానని మొత్తం దళిత సమాజాన్నే కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇలా మాదిగ సమాజాన్ని అవమానించి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని....కానీ పీపుల్స్ ప్రంట్ ప్రభుత్వం ఏర్పడగానే వారికి తగిన న్యాయం చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. 

ఇప్పటికే ప్రకటించిన ఫీపుల్స్ ప్రంట్ ప్రకటించిన ఉమ్మడి ఎజెండాలో ఎస్సీ వర్గీకరణను స్థానం కల్పించినట్లు ఉత్తమ్ తెలిపారు. ఆ దిశగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా నిలుస్తుందని ఉత్తమ్ ప్రకటించారు.

ఇక కుంతియా మాట్లాడుతూ...మంద కృష్న మాదిగను ఫీపుల్స్ ప్రంట్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. మాదిగల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మర్పిఎస్ డిమాండ్లకు కాంగ్రెస్ మద్దతిస్తుందని కుంతియా ప్రకటించారు.