Asianet News TeluguAsianet News Telugu

డ్రంక్ అండ్ డ్రైవ్.. రెండు నెలలకుపైగా జైలు శిక్ష

మోతాదుకు మించి మద్యం తాగి కనీస స్పృహ లేకుండా వాహనం నడిపినట్లు గుర్తించారు. దీంతో జడ్జి అతడికి 30 రోజుల జైలు శిక్షతో పాటు 4,500 రూపాయల జరిమానా విధించారు.

mahabubnagar court... 67 days jail term in drunken drive case
Author
Hyderabad, First Published Sep 18, 2018, 12:50 PM IST

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి వాహనాలను పోలీసులు వెంటనే సీజ్ చేసేస్తారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లి.. కోర్టులో హాజరుపరుస్తారు. వారికి న్యాయస్థానం వారు తాగిన మద్యం మోతాదుని బట్టి శిక్ష విధిస్తుంది. దాదాపు  చాలా మందికి ఫైన్ వేస్తుంది. లేదంటే రెండు, మూడు రోజులు జైలు శిక్ష విధిస్తుంది. అయితే.. మహబూబ్ నగర్ లో మాత్రం ఓ వ్యక్తికి ఏకంగా 67రోజుల జైలు శిక్ష విధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా ఐదుగురు వాహనదారులు మద్యం తాగినట్లు తేలింది. 

సోమవారం ఉదయం వీరిని ట్రాఫిక్‌ సీఐ అమర్‌నాథ్‌రెడ్డి జిల్లా మొబైల్‌ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి తేజో కార్తీక్‌ కేసులను పరిశీలించారు. అందులో ఓ వ్యక్తి మోతాదుకు మించి మద్యం తాగి కనీస స్పృహ లేకుండా వాహనం నడిపినట్లు గుర్తించారు. దీంతో జడ్జి అతడికి 30 రోజుల జైలు శిక్షతో పాటు 4,500 రూపాయల జరిమానా విధించారు. అయితే అతడు జరిమానా చెల్లించలేనని చెప్పడంతో అందుకుగానూ మరో 37రోజులు అదనంగా జైలు శిక్ష ఖరారు చేశారు. దీంతో మొత్తంగా ఆ వ్యక్తికి ఏకంగా 67 రోజుల జైలు శిక్ష పడింది. 

ఇదే డ్రంకెన్ డ్రైవ్ తనిఖిల్లో పట్టుబడ్డ మిగిలిన వాళ్లలో ఒకరికి 10 రోజులు, ఇతరులకు ఐదు రోజులలోపే జైలుశిక్షతో పాటు 2500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు. అయితే డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల చరిత్రలో ఇప్పటి వరకు 30 రోజుల వరకు జైలు శిక్ష విధించిన సందర్భాలు చూశాం. కానీ పాలమూరు వాసి మాత్రం రెండు నెలలకుపైగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios