రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ప్రేమజంటల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గార్ల మండలం రాజు తండా గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్ల అమృతండా సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకి ప్రశాంత్, అతని ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నారు. 

ఖమ్మంలో పదో తరగతి చదువుతున్న బాలుడు, డిగ్రీ చదువుతున్న 21 యేళ్ల యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం సోమవారం సాయంత్రం ఇంట్లో తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన ప్రేమజంట ఇంట్లోనుంచి పారిపోయారు.

తమ ప్రేమ ఎలాగూ పెద్దలు అంగీకరించరని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారి అటు నుండి వెడుతున్న రైతులు బావిలో శవాలు పడి ఉండడాన్ని చూసి తండా వాసులకు తెలిపారు. 

దీంతో తండా వాసులు బావి దగ్గరికి చేరి చూడగా.. వారిద్దరూ తమ తండా వాళ్లేనని తేలింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఏడుపులతో మార్మోగిపోయింది. సమాచారం అందుకు్న గార్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు.