నిజామాబాద్‌: ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ప్రేమికులిద్దరూ జంటగా ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జీవితాంతం కలిసి బ్రతకాల్సిన జంట చివరకు కలిసి ప్రాణాలు తీసుకున్నారు. 

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం లక్ష్మాపూర్‌ గ్రామ సమీపంలో అడవీ ప్రాంతంలో యువతీ యువకుడి మృతదేహాలు స్థానికులు గుర్తించారు. చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్న స్థితిలో వున్నాయి రెండు మృతదేహాలు. దీంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

read more  ప్రేమించాలంటూ యువతితో అసభ్యచేష్టలు.. అడ్డొచ్చిన సెక్యూరిటీని కొట్టి..

అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో యువతీ యువకులు వివరాలు తెలిశాయి.  మోస్రా మండలం తిమ్మాపూర్‌కి చెందిన మోహన్, లక్ష్మిగా గుర్తించారు. వీరిద్దరు ప్రేమికులుగా భావిస్తున్నారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. వారం రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.