Asianet News TeluguAsianet News Telugu

"టాక్ లండన్ బోనాల" జాతర... పోస్టర్‌ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

ఆషాడమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా బోనాల సంబరాలు మొదలవుతాయి. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజుల పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట బోనాల పండుగు జరుగుతుంటుంది. అయితే స్వరాష్ట్రంలో ఈ బోనాల పండగ మరింత వైభవంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కేవలం తెలంగాణలోనే ఇంగ్లాండ్ లో కూడా ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 

london bonalu festival poster launched by trs ex mp kavitha
Author
Hyderabad, First Published Jun 10, 2019, 11:05 PM IST

 ఆషాడమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా బోనాల సంబరాలు మొదలవుతాయి. ఇక హైదరాబాద్ లో అయితే నెల రోజుల పాటు ప్రతి ఆదివారం ఏదో ఒకచోట బోనాల పండుగు జరుగుతుంటుంది. అయితే స్వరాష్ట్రంలో ఈ బోనాల పండగ మరింత వైభవంగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కేవలం తెలంగాణలోనే ఇంగ్లాండ్ లో కూడా ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జులై 7న వెస్ట్ లండన్ బోనాల వేడుక జరగనుంది. అక్కడ స్థిరపడిన తెలంగాణ బిడ్డలంతా కలిసి సయన్ స్కూల్ ఆడిటోరియంలో ఈ పండగను జరుపుకోనున్నారు. అందుకోసం టాక్  పర్యవేక్షణలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో బోనాల జాతర పోస్టర్ ని హైదరాబాద్ లో మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు.
  
ఈ సందర్భంగా కవిత టాక్ సభ్యులను అభినందించారు.  తెలంగాణ రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా,  తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. 

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్ సంస్థ ప్రతినిధులు సతీష్ రెడ్డి  గొట్టెముక్కల, శ్వేతా రెడ్డి,  జాహ్నవి దూసరి, మల్లేష్ పప్పుల  తదితరులు పాల్గొన్నారు.

టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటివుండి ప్రోత్సహిస్తున్న  కవితకు టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఆలోచలనకు, ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పవిత్ర తెలిపారు. ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని అన్నారు. యూకేలో నివసిస్తున్న ప్రవాసులంతా బోనాల వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్ ని సంప్రదించమని  పవిత్ర వెల్లడించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios