నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం లింగాపల్లి సర్పంచ్  మంగళవారం నాడు మరణించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిలై ఆమె మరణించారు.

లింగాపల్లి సర్పంచ్ లక్ష్మి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం  ఓ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఆపరేషన్ వికటించడంతో  ఆమె మృతి చెందింది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిలై సర్పంచ్ లక్ష్మి మరణించడంతో  ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

గతంలో కూడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు  ఫెయిలై పలువురు మృతి చెందారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.