Asianet News TeluguAsianet News Telugu

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ

టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

legislative council chairman issues notices to four mlc's
Author
Hyderabad, First Published Dec 18, 2018, 5:23 PM IST


హైదరాబాద్: టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ టీఆర్ఎస్ శాసనమండలి ఛైర్మెన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు బుధవారం నాడు శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపుగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొండా మురళి, యాధవరెడ్డి, రాములు నాయక్, భూపతి రెడ్డిలు  పార్టీ మారారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున  ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని  టీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం నాడు  మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా స్వామిగౌడ్ నోటీసులు జారీ చేశారుఈ ఈ నోటీసులపై ఎమ్మెల్సీలు ఏ రకంగా  స్పందిస్తారో  చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios