హైదరాబాద్: ఏమైందో తెలియదు గానీ హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది.  మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని ఓ హాస్టల్‌లో శ్రీవిద్య (25) లేడీ ఆత్మహత్య చేసుకుంది. 


ఊపిరి అడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని శ్రీవిద్య ఉరి వేసుకొని ఆత్మహత్య‌కు పాల్పడింది. ఈ నెల 10వ తేదీన ఆమె హాస్టల్‌లో  చేరింది. రాత్రి నుండి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.