Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో కరోనాతో ల్యాబ్ టెక్నిషియన్ మృతి..

కరీంనగర్ లో ఓ ల్యాబ్ టెక్నిషియన్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న రామకృష్ణకి కొన్ని రోజులక్రితం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. 

lab technician died due to covid positive in karimnagar - bsb
Author
Hyderabad, First Published May 14, 2021, 4:18 PM IST

కరీంనగర్ లో ఓ ల్యాబ్ టెక్నిషియన్ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న రామకృష్ణకి కొన్ని రోజులక్రితం కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. 

ఈ నేపథ్యంలో ఆయనను వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాని పరిస్థితి విషమించడంతో ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

కరోనా బారినపడి రామకృష్ణ చనిపోవడంతో తెలంగాణ ల్యాబ్ టెక్నీషిన్ల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిలో నిరంతరం శ్రమిస్తూ కరోనా సోకడంతో చనిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా డ్యూటీలో కరోనాతో మరణిస్తున్న వారిలో ల్యాబ్ టెక్నీషియన్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అలానే మౌళిక సౌకర్యాలు కల్పించలేకపోవడం వల్లే కరోనా బారిన పడుతున్నామని రాష్ట్ర కమిటి పేర్కొంది. 

ఇప్పటికైనా ల్యాబ్ టెక్నిషియన్లు టెస్ట్ లు చేస్తున్న క్రమంలో కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంఘం కోరింది.

Follow Us:
Download App:
  • android
  • ios