హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలు కావడంపై కాంగ్రెస్ పార్టీ సమీక్షను ప్రారంభించింది. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా పార్టీ నేతలతో  ఓటమిపై సమీక్షించారు.

ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.  టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితితో  కలిసి  కాంగ్రెస్  పార్టీ పీపుల్స్ ఫ్రంట్  కూటమిని ఏర్పాటు చేసినా కూడ కాంగ్రెస్ పార్టీకి 19 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి.

కూటమిలోని టీడీపీకి రెండు సీట్లు దక్కాయి. సీపీఐ, టీజేఎస్ ‌కు ఒక్క సీటు కూడ దక్కలేదు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి కావడంపై  సమీక్ష నిర్వహించాలని  పార్టీ నేతలు కొందరు బహిరంగంగానే డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ నేతలతో   చర్చించేందుకు కుంతియా సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పార్టీ సెక్రటరీ సలీమ్ అహ్మద్‌తో పాటు  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన అభ్యర్థులు పాల్గొన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై   కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షిస్తున్నారు.