రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏ పదవిలో వచ్చి తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాహుల్ మమ్మీ అధ్యక్షురాలని.. ఆయన డమ్మీ అని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణకు వచ్చారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏ పదవిలో వచ్చి తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాహుల్ మమ్మీ అధ్యక్షురాలని.. ఆయన డమ్మీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఇండియాలో ఉంటాడో.. ఎప్పుడూ బయట ఉంటాడో తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ గాంధీ చదివారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మడానికి.. ఇది టెన్ జన్‌పథ్ కాదని మండిపడ్డారు. ఇది చైతన్యానికి ప్రతీక అయినా తెలంగాణ అని అన్నారు. కాంగ్రెస్ గురించి తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసన్నారు.
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి కరెంట్ ఇవ్వలేదని, రైతుల ఆత్మహత్యలను నివారించలేకపోయిందని అన్నారు. రిమోట్ కంట్రోల్ పాలన ఎవరిదో అందరికి తెలుసన్నారు. మన్మోహన్ సింగ్ పేరుకే ప్రధాని.. రిమోట్ కంట్రోల్ అంతా సోనియా గాంధీ అని అన్నారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు.
తమ ఇతర పార్టీలకు బీ టీమ్, సీ టీమ్ అయ్యే దౌర్భాగ్యం పట్టలేదన్నారు. తాము తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే టీమ్ అని చెప్పారు. తొత్తులుగా ఉండే అవసరం మాకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరే స్కాంగ్రెస్ అని విమర్శించారు. ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్, స్పెక్ట్రమ్ నుంచి మొదలుకుంటే.. పాతాళంలో దొరికే బొగ్గు వరకు అన్ని కుంభకోణాలే అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు దొంగను పక్కను కూర్చొబెట్టుకొని రాహుల్ అవినీతి గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ రాజు అయితే.. అడ్డంగా దొరికిన టీపీసీసీ అధ్యక్షుడు బయటే తిరిగేవాడా? అని ప్రశ్నించారు. యువరాజు అని రాహుల్ గాంధీనే పిలుస్తారని చెప్పారు. రాహుల్ ముత్తాత మోతీ లాల్ నెహ్రూ నుంచి మొదలుపెడితే జవహర్ లాలా నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ.. రాజరికం నడుస్తుందన్నారు. అలాంటి వారు ఇక్కడికి వచ్చి రాజులు అని మాట్లాడటమేటని ప్రశ్నించారు. ఒక వేళ కేసీఆర్ నియంత అయితే.. జర్నలిస్టుల పేరుతో కారుకూతలు కూసేటోళ్లు బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. పొద్దునే లేస్తే తిట్టుడు ప్రోగ్రామ్ పెట్టుకునే వారు ఇక్కడే ఉండేవారా? ఈ ఆటలు సాగుతాయా? అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ను క్షమించం అని.. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోం అని రాహుల్ అంటున్నారని.. పొత్తు కావాలని కాంగ్రెస్‌ను ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. కాలం చెల్లిన కాంగ్రెస్‌తో పొత్తుకు ఎవరూ సిద్దంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ ఔట్‌డేటెడ్ పార్టీ ఎద్దేవా చేశారు. సొంత నియోజవర్గం అమేథీలో ఎంపీగా గెలవలేని రాహుల్ గాంధీ ఇక్కకు వచ్చిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భవన్‌కు గాడ్సేకు అప్పగించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నరనరంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం నింపుకున్న వ్యక్తి అని విమర్శించారు.
ఏఐసీసీ అంటే ఆల్ ఇండియ క్రైసిన్ కమిటీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప రైతు పార్టీ అయితే పంజాబ్‌లో ఎందుకు ఓడిందని ప్రశ్నించారు. నిన్న కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. 2018లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.
తెలంగాణ ఇచ్చామని రాహుల్ గాంధీ మాట్లాడితే బాధగా ఉందన్నారు. ఆనాడూ ఇష్టం లేని పెళ్లి చేసిందని.. రాహుల్ గాంధీ తాత నెహ్రు కాదా అని ప్రశ్నించారు. అప్పటి నుంచి తెలంగాణ కోసం ఎంతో మంది మేధావులు పోరాటం సాగించారని చెప్పారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమం ఉధృతమైందన్నారు. తెలంగాణ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చింది తామేనని అన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటీష్ గొప్పోళ్లా.. లేక సాధించుకున్న భారత ప్రజలు గొప్పోళ్లా అని ప్రశ్నించారు.
జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉంటుందా.. రాష్ట్రానికో విధంగా ఉంటుందా అని ప్రశ్నించారు. రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లో రైతు డిక్లరేషన్ అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని అన్నారు. మద్దతు ధర కోసం రైతులు పోరాడుతుంటే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
