Asianet News TeluguAsianet News Telugu

నూకలు తినాలన్న పార్టీ తోకలు కత్తిరించాలి: సిరిసిల్లలో బీజేపీపై కేటీఆర్ ఫైర్


తెలంగాణ ప్రజలను అవమానించిన పార్టీల తోకలను కత్తిరించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ఇవాళ సిరిసిల్లలో నిర్వహించిన ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.

KTR Serious Comments On BJP In Sircilla Dharna
Author
First Published Apr 7, 2022, 3:05 PM IST


సిరిసిల్ల:నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవమానించిన పార్టీ తోకలు కత్తిరించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. Paddy ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద TRS ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు.సిరిసిల్లలో నిర్వహించిన ధర్నాలో KTR  పాల్గొన్నారు.  తెలంగాణ ప్రజలను ఉద్దేశించి  కేంద్ర మంత్రులు వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు.విదేశాలకు బాయిల్డ్ రైస్ ను కేంద్రం ఎగుమతి చేస్తుందన్నారు. ఈ విషయమై Rajyasabha ను కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.ఈ విషయమై తమ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారన్చారని కేటీఆర్ గుర్తు చేశారు. 

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరిందన్నారు. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay మాత్రం వరి ధాన్యాన్ని కేంద్రంతో చెప్పి కొనుగోలు చేయిస్తామని  రైతులను రెచ్చగొట్టి వరి ధాన్యం పండించేలా చేశారన్నారు. వరి ధాన్యం  కేంద్రం కొనుగోలు చేస్తుందని బంండి సంజయ్ మూడు దఫాలు చెప్పాడన్నారు.ఈ మేరకు బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కేటీఆర్ ఈ ధర్నాలో చూపారు.రాష్ట్రంలో  రైతులు రోడ్డెక్కడానికి కారణం ఎవరని ప్రశ్నించారు.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని Narendra Modi చెప్పారని ఆయన గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా అని ఆయన రైతులను అడిగారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వీడియో క్లిప్పింగ్ లను కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చూపారు.  రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను కూడా ఈ సభలో కేటీఆర్ చూపించారు.

వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్రంలో పలు రకాల ఆందోళనలు నిర్వహిస్తుంది.ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, ఈ నెల 6న జాతీయ రహదారుల దిగ్భంధనం చేపట్టింది.ఇవాళ కలెక్టరేట్ ల వద్ద ఆందోళనలు చేసింది. ఈ నెల 7న ప్రతి ఇంటిపై నల్లజెండాలను ఎగురవేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళనలు నిర్వహించనున్నారు. పంజాబ్ రాష్ట్రం నుండి కొనుగోలు చేస్తున్నట్టుగానే తెలంగాణలో ఉత్పత్తి అయిన  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios