ఎన్ని స్థానాల్లో గెలుస్తామో లెక్క చెప్పిన మంత్రి కేటీఆర్

KTR: అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో తాము ముందున్నామనీ, బి ఫారమ్‌లు జారీ చేయడంలోనూ తాము మొదటి స్థానంలో ఉన్నామని, అంతిమ ఫలితంలో కూడా ఇతర పార్టీల కంటే ముందుంటామని  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

KTR says BRS will be way ahead in poll results KRJ

KTR: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎత్తులు పై ఎత్తులతో పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకపోతుంది. ఇక బీజేపీ 50 మందికి పైగా అభ్యర్దులతో తొలి జాబితాను ప్రకటించగా.. కాంగ్రెస్ సగం అభ్యర్థులను ప్రకటించి.. రాహుల్, ప్రియాంక గాంధీ పర్యటనలో బిజీబిజీగా ఉంది. ఇలాంటి ఉద్రికత్త వాతావరణంలో అవకాశం దొరికినప్పుడల్లా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ మిని సైజ్ యుద్దమే జరుగుతోంది.  

తాజాగా ప్రగతి భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షాలను ఏకీపారేశారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. 60 రోజుల క్రితం తాము అభ్యర్థులను ఖరారు చేశామని, బీఫారాల పంపిణీ చేశామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల బీఆర్ఎస్ అన్ని విధాలుగా ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.  ఏ పార్టీ కూడా తమ పార్టీకి పోటీ కాదని, ఏ నాయకుడు కూడా తమతో సరితూగరని విమర్శించారు.
 
తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో, బి ఫారమ్‌లు జారీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు. అంతిమ ఫలితంలో కూడా తమ పార్టీ ఇతర పార్టీల కంటే చాలా ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు, BRS వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరనీ, ఇక బీజేపీ యుద్దానికి ముందే చేతులెత్తేసిందని విమర్శించారు. ఈసారి బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని అన్నారు. 

పార్టీ మేనిఫెస్టోపై వస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గెలిచే అవకాశం లేని పార్టీలు ఎలాంటి హామీలు, వాగ్దానాలైనా చేయవచ్చని అన్నారు. బీఆర్ఎస్ విషయానికొస్తే.. తరువాత అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేననీ, అందుకే అమలు చేయలేని వాగ్దానాలు చేయబోమని అన్నారు.  గత ఎన్నికల్లో మేనిఫెస్టోల్లో లేని ఎన్నో పథకాలను తమ ప్రభుత్వం  అమలు చేసిందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడంపై ఆయన మాట్లాడుతూ ..కేసీఆర్ రాష్ట్ర ప్రజల సొత్తు అని అన్నారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నా ప్రజలు ఆయనకు ముక్తకంఠంతో స్వాగతం పలుకుతున్నారనీ,  ఆయన గతంలో  కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, గజ్వేల్ తదితర స్థానాల నుంచి పోటీ చేశారనీ,  ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో ఎన్నుకున్నారని గుర్తు చేశారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయాలనే నిర్ణయానికి తన సొంత గ్రౌండ్ ఉందని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios