చేపల ఉత్పత్తిలో తెలంగాణ మరో మైలురాయి చేరుకుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.  చేపల ఉత్పత్తిలో  తెలంగాణ 3లక్షల టన్నుల మైలు రాయి చేరుకుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్... తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖాధికారులను అభినందించారు. 
 
ట్విట్టర్ వేదికగా చేపలతో మత్స్యకారులు ఉన్న ఫోటోలను షేర్ చేసి మరీ  మత్స్యశాఖ అధికారులు, చేపల పెంపకందారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్ చెప్పారు. చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని కేటీఆర్ తెలిపారు.