రాజకీయ కక్ష సాధింపే బీజేపీ లక్ష్యం - కేజ్రీవాల్ అరెస్ట్ పై కేటీఆర్

ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలో సాధనాలుగా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. 

KTR on Kejriwal's arrest: BJP's aim is to create political vendetta..ISR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 

కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే సంస్థలపై విమర్శలు - జేపీ నడ్డా

అందులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ‘‘బీజేపీ చేతిలో అణచివేతకు ఈడీ, సీబీఐ ప్రధాన సాధనాలుగా మారాయి. రాజకీయ ప్రత్యర్థులను నిరాధారమైన కారణాలతో టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు వారి ఏకైక లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు. 

BJP: పార్లమెంటు బరిలో తమిళిసై.. చెన్నై సౌత్ నుంచి పోటీ

ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్ అరెస్ట్ ను విపక్షాలు కూడా ఖండించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాబల్యం పెరుగుతోందని, అందుకే ఆ పార్టీని అణచివేయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించాయి. విపక్ష పార్టీలను ఎదుర్కొనేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆరోపించాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నాయి. ఇవన్నీ విపక్ష పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే చేస్తోందని విమర్శించాయి.

సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి.. ఎందుకంటే ?

కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం సాయత్రం అరెస్ట్ అయ్యారు. చాలా కాలం నుంచి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. సుమారు 12 మంది ఈడీ అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి, మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు. తరువాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios