తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తో ఉత్తర ప్రదేశ్ మంత్రి సతీష్ మహానా భేటీ అయ్యారు. ఉత్తర ప్రదేశ్ వచ్చే నెల జనవరి నుండి అలహాబాద్ కుంభ మేళా జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తరపున మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులకు స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణకు వచ్చిన యూపీ మంత్రి హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిశారు. కుటుంబంతో కలిసి అలహాబాద్ కుంభమేళాకు విచ్చేయాలని ఆహ్వానించారు.

యూపీ మౌలికవసతులు, పరిశ్రమల మంత్రి సతీశ్ మహానా ఆహ్వానంపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఆయనకు మర్యాదపూర్వకంగా బొకేతో ఆహ్వానం పలికిన కేటీఆర్ ఓ మెమొంటోను బహూకరించారు.
అలహాబాద్ లో 2019 జనవరి 15 నుంచి మార్చి 4 వరకూ దాదాపు 3 నెలల పాటు కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు, ముఖ్య అతిథితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా భక్తులకు వసతి ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో అలహాబాద్ లోని పంక్షన్ హాల్స్ ని వాడుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ 3నెలల పాటు నగరంలో పెళ్లిల్లపై నిషేదం విధించింది.

ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులతో పాటు ఎప్పుడూ జనావాసాలకు దూరంగా వుండే నాగా సాధువులు కూడా వస్తుంటారు. పవిత్ర గంగా నదిలో స్నానాలు చేసి వీరంతా తరిస్తుంటారు.