తెలంగాణ ఉద్యమానికి డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ జీవితం, పనితీరే ఆదర్శంగా నిలిచాయని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. మేమందరం ఆయన సందేశాలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందకు కదిలామని కవిత పేర్కొన్నారు. అంబేద్కర్ 63 వ వర్థంతి సందర్భగా కవిత ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు. 

గొప్ప రాజనీతీజ్ఞులు, న్యాయ కోవిదులు,  ఆర్థికవేత్త, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడైన డా. అంబేద్కర్ 1956 వ సంవత్సరంలో ఇదే తేదీన మరణించారని కవిత గుర్తు చేశారు. 63వ మహాపరినిర్వన్ దివస్ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఆయన మరణించినప్పటికి  ఆ గొప్పతనం ఇంకా బ్రతికే వుందని కవిత తెలిపారు. ప్రతిఒక్కరు ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడవాలని కవిత సూచించారు. 

ఇక అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ వేదికన నివాళులర్పించారు. భారత రత్న అంబేద్కర్ మహాపరినిర్వన్ సందర్భంగా  నివాళులర్పిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.