జనగామ: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఎర్రబెల్లి కూడ పాజిటివ్ గా తీసుకొన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో  కేటీఆర్ గురువారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా జనగామలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో  కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఆసక్తికర  వ్యాఖ్యలు చేశారు.

ఈ దఫా ఎర్రబెల్లి దయాకర్ రావుకు  సుమారు 55 వేలకు పైగా మెజారిటీ వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఆరు దపాలు ఎమ్మెల్యేగా  ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారని ఆయన గుర్తు చేశారు.

అయితే ఇప్పటివరకు దయాకర్ రావు వేరే (టీడీపీలో) పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న సమయంలో వచ్చిన మెజారిటీ కంటే ఈ దఫా ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పారు. సరైన వ్యక్తి సరైన పార్టీలో ఉన్నారని దయాకర్ రావు గురించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే ఈ ఎన్నికల్లో  దయాకర్ రావుకు ఎక్కువ మెజారిటీ వచ్చిందని కేటీఆర్  చెప్పారు.

కేటీఆర్ వ్యాఖ్యలను కూడ దయాకర్ రావు కూడ పాజిటివ్ గా తీసుకొన్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే దయాకర్ రావు ప్రకాష్ గౌడ్‌తో కలిసి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన విషంయ తెలిసిందే.

సంబంధిత వార్తలు

గడ్డం తీస్తారో తీయరో: ఉత్తమ్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు