హైదరాబాద్: టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి కె టి రామారావు సోమవారంనాడు తన కూతురు అలేఖ్య ప్రైమరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి  హాజరయ్యారు. 

ఒకరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అలేఖ్య నానమ్మ, ముఖ్యమంత్రి కెసీఆర్ సతీమణి శోభ, అమ్మమ్మ శశిరేఖ, కేటీఆర్ భార్య శైలిమా, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేటీఆర్ కూతురు 5వ తరగతి పూర్తి చేసుకుని రానున్న విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి చదవనున్నారు. 

కూతురు ప్రాథమిక విద్యా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరైన తర్వాత తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు.