తెలంగాణ ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం దొరికింది. కొత్తగూడెం కేటీపీఎస్ ఆపరేషన్స్, మెయిన్‌టెన్స్ మేనేజర్ కర్రి ఆనందం లంచం కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు.

లంచం కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న ఆడియోలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.70 లక్షల కాంట్రాక్ట్‌ను ఇచ్చానని తనకు లంచం ఇవ్వకుంటే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తానని ఆనందం బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారుల ఆపరేషన్‌లో రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆనందం దొరికిపోయాడు. కాగా కర్రి ఆనందంపై గతంలోనే లంచం తీసుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి.